Sunday, September 24, 2023

జేమ్స్ కెమ‌రూన్ కి క‌రోనా… అవ‌తార్‌-2 ఫిల్మ్ ప్రీమియ‌ర్‌కు దూరం

మ‌ళ్లీ క‌రోనా కేసులు అక్క‌డ‌క్క‌డా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కాగా హాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జేమ్స్ కెమ‌రూన్ క‌రోనాబారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న అవ‌తార్‌-2 ఫిల్మ్ ప్రీమియ‌ర్‌కు దూరం కానున్నారు. కోవిడ్‌19 ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింద‌ట‌..దాంతో లాస్ ఏంజిల్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ అవ‌తార్ ప్రీమియ‌ర్‌కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు హాలీవుడ్ రిపోర్ట‌ర్ మ్యాగ్జిన్ పేర్కొంది. జేమ్స్‌కు కోవిడ్ పాజిటివ్ ఉన్నా.. ఆయ‌న ప్ర‌స్తుతం ఆరోగ్యంగా ఉన్నార‌ని, రొటీన్ టెస్టింగ్ చేస్తున్న స‌మ‌యంలో జేమ్స్ పాజిటివ్‌గా తేలింద‌ని, వ‌ర్చువ‌ల్‌లో ఆయ‌న షెడ్యూల్‌లో పాల్గొంటార‌ని, ప్రీమియ‌ర్‌కు హాజ‌రుకావ‌డంలేద‌ని డిస్నీ సంస్థ ప్ర‌తినిధి తెలిపారు. లాస్ ఏంజిల్స్ కౌంటీలోని నేచుర‌ల్ హిస్ట‌రీ మ్యూజియంలో అవ‌తార్‌: ద వే ఆఫ్ వాట‌ర్స్ ఫిల్మ్ ప్రీమియ‌ర్ జ‌ర‌గ‌నున్న‌ది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement