Friday, April 26, 2024

టీఎస్ఆర్టీసీ బస్సుల ప్రయాణ వేళలు పొడిగింపు

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈనెల 10 నుంచి ఉ.6 గంటల నుంచి సా.6 గంటల వరకు సడలింపులను ఇచ్చింది. దీంతో టీఎస్ఆర్టీసీ జిల్లాలకు నడిపే బస్సులను ఉ.6 గంటల నుంచి సా.6 గంటల వరకు తిప్పుతామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2 గంటల వరకే నడుపుతున్నామని, వాటినే సా.6 గంటల వరకు తిప్పుతామని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో ఉ.6 గంటల నుంచి సా.5 గంటల వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. లాక్‌డౌన్ విరామ సమయంలో సిటీ బస్సులను తిప్పుతామని ఈడీ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని బస్ పాస్ కౌంటర్లన్నీ ఉ.6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement