Sunday, May 19, 2024

TS | కోఠిలో భారీ అగ్నిప్రమాదం…

నగరంలోని కోఠి మార్కెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. కోఠి గుజరాతీ గల్లీలోని జెఎండి ఎలక్ట్రానిక్స్ కి చెందిన సిసి కెమెరా గోదాంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. అభిషేక్ అగర్వాల్ అనే వ్యక్తి జెడి ఎలక్ట్రానిక్స్ పేరుతో అదే గల్లీ సిసి కెమెరాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ కెమెరాలకు సంబందించిన స్టోరేజ్ గోదాంను దుకాణానికి సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్ లోని మొదటి అంతస్తులోఈ ప్రమాదం జరిగింది. సమయానికి గోదాం లో ఎవరు లేకపోవడం తో ప్రమాదం తప్పింది.

రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో గోదాం షేటర్ నుండి బయటకు పొగలు రావడంతో… అదే భవనంలో నివాసం ఉంటున్న స్థానికులు గమనించి వెంటనే సుల్తాన్ బజార్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి గోదాం వద్దకు చేరుకొని షటర్లను పగలగొట్టి, రెండు ఫైరింజన్ ల సహాయంతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 20 నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే సిసి కెమెరాలు అగ్నికి ఆహుతయ్యాయని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement