Tuesday, July 23, 2024

AP | మిలాన్‌ వేడుకుగా సర్వం సిద్ధం.. రేపటి నుంచి ప్రారంభం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: విశాఖ మరో అంతర్జాతీయ వేడుకకు సిద్దమవుతుంది. ఇండియన్‌ నేవీ బహుళ జాతీయ వ్యాయామం(మిలాన్‌-24) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఈనెల 19 నుంచి 27వరకూ నిర్వహించనున్నారు. రెండు దశల్లో జరిగే బహుపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారధ్యం వహించనుంది. ఈ క్రమంలోనే మిలాన్‌-24 వేడుకులు ఘనంగా నిర్వహించేందుకు తూర్పు నేవికాదళం అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. భారతదేశం బాధ్యతాయుతమైన సముద్రశక్తిని ప్రపంచాని చూపడమే లక్ష్యంగా బహుళ జాతీయ విన్యాసాలను ఇండియన్‌ నేవీ నిర్వహించనుంది.

అంతేకాకుండా పలు దేశాల నౌకాదళల మధ్య స్నేహపూర్వక,వృత్తిపరమైన పరస్పర చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సీసీసీ( సిద్దం,సంఘం, సహకారం) పేరిట నిర్వహించనున్న ఈ వేడుకులకు 50 దేశాలకు చెందిన నేవీ అధికారులు, ప్రముఖలు,సిబ్బంది పాల్గొనున్నారు. అయితే ఈ వేడుకులకు పలు దేశాలకు చెందిన 15 యుద్ధ నౌకలు,ఇండియన్‌ నేవీకి చెందిన 20 షిప్‌లు,విక్రాంత్‌, విక్రమాదిత్యతో పాటు, మిగ్‌29కె, పి8ఐ ఎయిర్‌క్రాఫ్ట్లులు కూడా పాల్గొంటున్నట్టు నేవీ అధకారులు తెలిపారు.

ఈ వేడుకులను విజయవంతం చేసేందుకు ఈఎన్‌సీ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.అయితే ఈ కార్యక్రమాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజధాన్‌సింగ్‌తో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌తో పాటు, పలువురు ప్రముఖులు, పలు దేశాల నుంచి నేవీ ప్రతినిధులు హాజరుకానున్నారు.ఈ క్రమంలోనే శనివారం విశాఖ నగరంలోని బీచ్‌ పరిసర ప్రాంతాలన్నింటిలో ఎంహెచ్‌ 60ఆర్‌ సీహక్‌ హెలికాప్టర్‌ ప్రత్యేక స ర్వే చేపట్టింది.

రెండు దశల్లో విన్యాసాల నిర్వహణ

మిలాన్‌-24 వ్యాయమం రెండు దశలను కలిగి ఉంటుందని, హర్భర్‌ ఫేజ్‌, సీఫేజ్‌ దశల మధ్య జరిగే విన్యాసాల్లో పలు దేశాలకు చెందిన నౌకలు పాల్గొని ఆయా దేశాల మధ్య సాంస్కృతిక భాగస్వామ్యాన్ని ప్రొత్సహించడానికి అవకాశం ఉంటుందన్నారు. దీనితో పాటుగానే ఇంటర్నేషనల్‌ మారిటైమ్‌ సెమినార్‌, ఇంటర్‌ నేషనల్‌ సిటీ పెరేడ్‌, మారిటైం టెక్‌ ఎగ్జిబిషన్‌, మిలాన్‌ ఆఫ్‌ యంగ్‌ ఆఫీసర్స్‌ క్రీడా ఈవెంట్లు నిర్వహించనున్నారు. సముద్ర దశలో సముద్రపు గస్తీ, విమానంతో పాటు నౌకలు, స్నేహపూర్వక విదేశీ దేశాల జలాంతర్గాములు, భారత నావికాదళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు పాల్గొననున్నాయి.

- Advertisement -

అదే విధంగా భారీ బల విన్యాసాలు, ఆధునాతన వాయు రక్షణ కార్యాకలపాలు, జలాంతర్గామి వ్యతిరేక యుద్దం, ఉపరితల వ్యతిరేక కార్యకలాపాలను కలిగి ఉంటుందన్నారు.అయితే ఈ విన్యాసాలను తొమ్మిది రోజల పాటు కూడా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మిలాన్‌-2024 విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్‌ దేశాలకు ఆహ్వానాలు అందించింది. ఇందులో ఇప్పటికే 50 దేశాలు తాము పాల్గొంటు-న్నట్లు- అంగీకారం తెలిపాయి. మిగిలిన దేశాలూ వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement