Saturday, April 27, 2024

ట్రంప్ కు త‌ప్పిన ప్ర‌మాదం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కు త్రుటిలో ప్రమాదం త‌ప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్​లో లోపం వల్ల న్యూ ఓర్లియాన్స్​లో అత్యవసరంగా దింపారు అధికారులు. మెక్సికో గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో ఇంజిన్​ పనిచేయటం ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా న్యూ ఓర్లియన్స్​లో ల్యాండ్ చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన గత వారాంతంలో జరిగింది. ట్రంప్​ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్​ అయిన విషయాన్ని తొలుతో పొలిటికో వార్తాసంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు ధ్రువీకరించారు. అయితే.. ఆ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement