Wednesday, May 1, 2024

‘అఖండ‌’@100డేస్

గ‌త ఏడాది డిసెంబ‌ర్ 2న రిలీజ్ అయిన అఖండ చిత్రం జ‌న‌వ‌రి 20వ తేదీ నాటికి ఈ సినిమా 103థియేట‌ర్ల‌లో 50రోజుల‌ను పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇన్ని థియేటర్లలో 50 రోజులను పూర్తిచేసుకున్న సినిమా లేదు. ఇక అప్పటి నుంచి అలా కొనసాగుతూ వస్తున్న ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన 100 రోజులను పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను ఈ స్థాయిలో ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలని ఈ సినిమా టీమ్ నిర్ణయించుకుంది. ఈ నెల 12వ తేదీన కర్నూల్ ఎస్టీబీసీ గ్రౌండ్స్ లో ‘కృతజ్ఞత సభ’ను ఏర్పాటు చేశారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది. ఒక రకంగా ఇది చాలాకాలం తరువాత జరుగుతున్న 100 డేస్ ఫంక్షన్ అనే చెప్పుకోవాలి. హీరో బాల‌కృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో ‘అఖండ’ సినిమా తెరకెక్కింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement