Sunday, April 28, 2024

Trent Boult | ట్రెంట్ బౌల్ట్ స‌రికొత్త రికార్డ్.. మొద‌టి ఓవ‌ర్‌లో అత్య‌ధిక వికెట్లు..

ఐపీఎల్‌లో మొద‌టి ఓవ‌ర్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా ట్రెంట్ బౌల్ట్ రికార్డుల‌కు ఎక్కాడు. ఇవ్వాల (సోమ‌వారం) జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ పేరిట ఉండ‌గా… ఈ మ్యాచ్ తొలి ఓవ‌ర్ లో ముంబై ఓపెన‌ర్ రోహిత్ శర్మ (6) ను ఔట్ చేసి భువీ రికార్డును బౌల్ట్ బ‌ద్ద‌లు కొట్టాడు. ఐపీఎల్‌లో మొద‌టి ఓవ‌ర్‌లో బౌల్ట్‌కు ఇది 26 వికెట్ కావ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement