Tuesday, May 7, 2024

Travel Effect – బిపర్‌జాయ్ తుఫాన్ తో 67 రైళ్లు ర‌ద్దు..

గుజ‌రాత్ – మ‌రో 48 గంట‌ల‌లో బిపర్‌జాయ్ తుఫాన్ గుజ‌రాత్ తీరాన్ని తాక‌నున్న నేప‌థ్యంలో రైల్వే నుంచి కీలక ప్రకటన వెలువడింది. ముందు జాగ్ర‌త్త చర్య‌గా 67 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారీ తుఫాను కారణంగా పశ్చిమ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అరేబియా సముద్రంలో పర్‌జాయ్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చిందని భారత వాతావరణ శాఖ ప్రకటించడంతో ఈ తాజా నిర్ణయం తీసుకున్నారు. రానున్న 24 గంటల్లో తుఫాను బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తతో ఈ చర్య తీసుకుంది.


కాగా బిప‌ర్ జాయ్ తుపాన్ ప్ర‌భావంతో సౌరాష్ట్ర -కచ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 180 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్ కచ్ తీరంలో తుఫాను కారణంగా 144 సెక్షన్ విధించారు. రైల్వే శాఖ అప్రమత్తమై రైళ్ల రద్దు నిర్ణయం తీసుకుంది. ప్ర‌ధాని స్వ‌యంగా తుపాన్ ప్ర‌భావం ప‌ర్య‌వేక్షిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement