అనుమతి లేకుండా మహిళని తాకడం నేరమని హీరోయిన్ ..నేషనల్ అవార్డు గ్రహిత అపర్ణ బాలమురళి అన్నారు. తాజాగా ఆమెకి చేదు సంఘటన ఎదురైంది. ఓ స్టూడెంట్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిండాడు.దాంతో ఆ వీడియోపై పలువురు సెలబ్రెటీలు ఇది చాలా అసభ్యకరం అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.ఈ ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణలు చెప్పారని తెలిపింది. అందుకే దీన్ని ఇష్యూ చేయాలనుకోవడం లేదంది. తాజాగా ఈ ఘటనపై నటి అపర్ణ బాలమురళి స్పందించింది. ఈ ఘటన తనను చాలా బాధించిందని తెలిపింది. లా చదువుతున్న విద్యార్థి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరమన్న విషయం తెలియదా అంటూ మండిపడింది. బలవంతంగా తన చేయి పట్టుకొని కుర్చీలో నుండి పైకి లేపడం సరికాదని. తను భుజాలపై అతను చేతులు వేసేందుకు ప్రయత్నించాడని అసహనం వ్యక్తం చేసింది.
- Advertisement -