Monday, April 29, 2024

దిగివస్తున్న టమాట ధరలు.. మార్కెట్లకు టమాట రాక!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సామాన్య, పేదలకు శుభవార్త. నిన్న మొన్నటి వరకు బెంబేళెత్తించిన టమాట ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలోని పలుచోట్ల టమాట ధరలు తగ్గాయి. ఇక ఒకటి, రెండు రోజుల్లో కిలో టమాట రూ.300 వరకు చేరుతుందని బెంబెళెత్తిపోతున్న పరిస్థితుల్లో టమాట సామాన్యులు, పేదలను కరుణించింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పలు రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో కిలో టమాట రూ.65కు లభిస్తోంది.

బయట మాల్స్‌, షాపుల్లో కిలో టమాట రూ.120దాకా విక్రయిస్తున్నారు. ఒకటి రెండు రోజులుగా హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లకు టమాట పంట రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పది రోజుల కిందట పరిస్థితులు చూస్తే .. హైదరాబాద్‌కు 850 క్వింటాళ్ల టమాట మాత్రమే వచ్చింది. కానీ సోమవారం ఒక్కరోజే రెండు వేల క్వింటాళ్ల టమాట హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చింది.

- Advertisement -

ఏపీ, కర్ణాటక నుంచి అధికంగా టమాట హైదరాబాద్‌కు వస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని జిల్లాల నుంచి కూడా టమాట ఎక్కువగానే వస్తోంది. ఫలితంగా కిలో రూ.100లోపుకు దిగి వచ్చింది. ఆగస్టు నెలాఖారు నాటికి కిలో ధర 50కు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే టమాట ధరలు తగ్గినా ఇతర నిత్యవసర సరుకుల ధరలు ఇంకా ఆకాశ్నంటుతున్నాయి.

వంటనూనె, బియ్యం, గోధుమలు, కందిపప్పు ధరల పెరుగుదలు భారీగా పెరిగాయి. కిలో పచ్చిమిర్చి ధర రూ. 120 -140 మధ్య ఉంది. ఏ మాత్రం దిగి రావటం లేదు. క్యాప్సికం, బీన్స్‌ కూరగాయల ధరలు కూడా పోటీపడి పరుగులు తీస్తున్నాయి. ఎండుమిర్చి ధర కిలో 380 -400 మధ్య పలుకుతున్నాయి. గత మూడు నాలుగు నెలల నుంచి నిత్యావసర ధరలు భారీగా పెరగటంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement