Friday, April 26, 2024

ఒలింపిక్స్ ఇండియన్ టీమ్ కు RRR విషెస్..

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ టీమ్ విషెస్ చెప్పింది. జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో అతిపెద్ద క్రీడా సంబురం ఒలింపిక్స్‌ మ‌రి కొద్ది గంట‌ల‌లో ప్రారంభం కానుంది. కాగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం టీమిండియా క్రీడాకారులకు ప్ర‌త్యేక పోస్ట‌ర్ ద్వారా విషెస్ తెలియ‌జేసింది. గ‌న్ చేత ప‌ట్టిన రామ్ చ‌ర‌ణ్‌ ఫోటో, బ‌ళ్లెం ప‌ట్టిన ఎన్టీఆర్ పొటోని జ‌త చేసి శుభాకాంక్ష‌లు అందించింది. టోక్యో ఒలింపిక్స్‌ లో పాల్గొనే ఇండియ‌న్ క్రీడాకారుల‌కు ఆల్ ది బెస్ట్ అంటూ ఆర్ఆర్ఆర్ టీం విషెస్ తెలిపింది. ప్ర‌త్యేక పోస్ట‌ర్ సినీ , క్రీడా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అక్టోబ‌ర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ప‌లు దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొని ప‌త‌కాలు గెల‌వాల‌నే క‌సితో ఉన్నారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో కేవ‌లం రెండే మెడ‌ల్స్ గెలిచి తీవ్రంగా నిరాశ ప‌రిచిన ఇండియా ఈ సారి మాత్రం ఎక్కువ మొత్తంలో ప‌త‌కాలు గెల‌వాల‌నే క‌సితో ఉంది.

ఇది కూడా చదవండి: పద్దతి మార్చుకోండి: గ్రామ సర్పంచ్లకు హరీశ్ ఆదేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement