Thursday, April 25, 2024

బాలయ్య తో యంగ్ డైరెక్టర్ సినిమా ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఘోర గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత లైన్ లో అనిల్ రావిపూడి, శ్రీవాస్, పూరి జగన్నాథ్ లైన్ ఉన్నారు.

అయితే కొత్తగా ఆ లిస్టులో వెంకీ కుడుముల చేరినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలయ్య కు వెంకీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందట. దీనితో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని చెప్పాడట. మరోవైపు బాలయ్య తో సినిమాలు చేయడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సి కళ్యాణ్, సితార ఎంటర్టైన్మెంట్ వారు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement