Monday, May 6, 2024

టీమిండియా గ‌ట్టెక్కేనా.. భార‌త్ కు నేడు అగ్ని పరీక్ష‌..

తప్పక గెలవాల్సిన చివరి టీ20 విజయం సాధించిన భారత్‌ నాలుగో టీ20లో ఆత్మవిశ్వసంతో మైదానంలో అడుగుపెడుతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్‌ ప్రస్తుతం టీ20 సిరీస్‌ను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో ఓటములను చవిచూసిన టీమిండియా మూడో టీ20 మాత్రం 7 వికెట్లతో ఘన విజయం సాధించి సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఇక‌, ప్రస్తుతం 1-2తో సిరీస్‌లో వెనుకబడిన భారత్‌ చివరి రెండు మ్యాచుల్లో గెలిచి ఈ సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. నేడు విండీస్‌ – భారత్‌ మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌ జరగనుంది. మరోవైపు విండీస్‌ కూడా ఈ మ్యాచ్‌లోనే టీమిండియాను ఓడించి సిరీస్‌ దక్కించుకోవాలని ఆతృతగా ఉంది. గత మ్యాచ్‌లో సూర్యకుమార్‌ను కట్టడి చేయడంతో విండీస్‌ బౌలర్లు విఫలమయ్యారు. ఈ సారి సూర్యపై ఫోకస్‌ చేస్తామని కరేబియన్‌ జట్టు సారథి పావెల్‌ పేర్కొన్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌ ఇరు జట్లు కీలకంగా మారింది.

జట్ల వివరాలు: (అంచనా)

భారత్‌

హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మాన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌, ఆక్షర్‌ పటేల్‌, చాహల్‌, రవీ బిష్నోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌.

- Advertisement -

వెస్టిండీస్‌

రోమన్‌ పోవెల్‌ (కెప్టెన్‌), కీల్‌ మయర్స్‌ (వైస్‌ కెప్టెన్‌), జాసన్‌ చార్లేస్‌, హేట్‌మయర్‌, జాసన్‌ హోల్డర్‌, షై హోప్‌, అకీల్‌ హోసెన్‌, అల్జారీ జోసెఫ్‌, బ్రాండన్‌ కింగ్‌, ఓబెద్‌ మెకాయ్‌, నికొలాస్‌ పూరన్‌; షెఫర్డ్‌, ఒడియన్‌ స్మిత్‌, ఓషన్‌ థామస్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement