Friday, May 3, 2024

కేటీఆర్ ట్వీట్ కి సమాధానం చెప్పిన సౌరవ్ గంగూలీ..

కేటీఆర్ ట్వీట్ కి సౌరవ్ గంగూలీ సమాధనం చెప్పడమేంటని ఆలోచిస్తున్నారా..? బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సేహ్వాగ్. అయితే వీరికి ఓ ఆశక్తికర ప్రశ్న సంధించారు అమితాబ్. తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో చేసిన ఓ ట్వీట్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ షోలో ప్రశ్నగా మారింది. కేటీఆర్ గతంలో చేసిన ఓ ట్వీట్‌ను అమితాబ్ వీరికి ప్రశ్నగా సంధించారు. గంగూలీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం గమనార్హం.

ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కరోనా ఔషధాల పేర్లను ప్రస్తావిస్తూ ఈ ఏడాది మే 20న కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. పలికేందుకు కష్టంగా ఉన్న పేర్లను ఎందుకు పెట్టారో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కేటీఆర్ ట్వీట్‌కు బదులిస్తూ తానైతే కరోనిల్, కరోజీరో, గో కరోనా గో వంటి పేర్లు పెడతానని పేర్కొన్నారు. తాజాగా, ఇదే ప్రశ్నను అమితాబ్ తన కేబీసీ షోలో అడిగారు. కేటీఆర్ తన ట్వీట్‌ను ఎవరికి ట్యాగ్ చేశారని ప్రశ్నించారు. సౌరవ్ గంగూలీ బాగా ఆలోచించిన అనంతరం శశిథరూర్ అని సరైన సమాధానం ఇచ్చారు. కేబీసీలో తన ట్వీట్‌ను ప్రశ్నగా అడగడంపై కేటీఆర్ తాజాగా స్పందించారు. సరదాగా చేసిన ట్వీట్ కేబీసీలో ప్రశ్నగా వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా, ఈ షోలో గంగూలీ, సెహ్వాగ్ జంట రూ. 25 లక్షలు గెలుచుకున్నారు.

ఇది కూడా చదవండి: టీమిండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ లో గెల్లు శ్రీనివాస్ కు మద్దతు..

Advertisement

తాజా వార్తలు

Advertisement