Tuesday, April 30, 2024

పెట్రోల్ ధరలపై నిరసన.. సత్యాగ్రహ దీక్షకు దిగిన కోదండరాం

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం గురువారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో కోదండరాం సహా పలువురు నేతలు దీక్షకు దిగారు. సాయంత్రం 4 గంటల వరకు టీజేఎస్ పార్టీ నేతల సత్యాగ్రహ దీక్ష కొనసాగనుంది.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రంగానికి ప్రధాన వనరు ఇంధనం అని అన్నారు. అలాంటి ఇంధనాన్ని ప్రభుత్వం తక్కువ ధరకు ఇవ్వకపోతే దేశ ప్రజలు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేమన్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా లీటరు పెట్రోల్‌ను రూ.50కి ఇవ్వొచ్చని కోదండరాం అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ వార్త కూడా చదవండి: మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ

Advertisement

తాజా వార్తలు

Advertisement