Saturday, April 20, 2024

నాతో బలవంతంగా ఫోర్న్ చేయించారు: గహనా వశిష్ఠ్‌..

బాలీవుడ్ లో కలకలం రేపిన ఫోర్న్ రాకెట్ కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఫోర్న్ మూవీస్ నిర్మిస్తున్నారన్న కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. అడల్ట్ సినిమాల్లో అవకాశాల పేరుతో పలువురు నటులతో నీలి చిత్రాలు తీశారన్న ఆరోపణలను రాజ్ కుంద్రా ఎదుర్కొంటున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా ఓ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. హాట్ షాట్స్ యాప్ కోసం తనతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారని ముంబైకి చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఆయన ఉద్యోగులే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇవ్వగా.. తాజాగా ముంబై కి చెందిన ఒక నటి హాట్‌షాట్స్‌ కోసం తనతో బలవంతంగా పోర్న్‌ వీడియోలు చేయించారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నటి గహనా వశిష్ఠ్‌తోపాటు రాజ్‌కుంద్రా సంస్థకు చెందిన నలుగురిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

ఇక పోర్న్ సినిమాలను నిర్మిస్తున్నారనే ఆరోపణలతో ఇప్పటికే నటి గహానా వశిష్ఠ్ జైలుకెళ్లి వచ్చారు. ఫిబ్రవరి‌లో గహనా వశిష్ఠ్‌ సహా 10 మందిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాదాపు 5 నెలల పాటు ఆమె జైల్లో ఉన్నారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement