Tuesday, April 30, 2024

వసూల్ రాజాలు..కవిత పీఏలమంటూ..

ఎంపీ పీఏలమంటూ డబ్బులు వసూలు చేసిన ముగ్గుర్ని ఢిల్లీలో అరెస్టు చేసింది సీబీఐ. ఢిల్లీలో మహబూబాబాద్ ఎంపీ పీఏలమంటూ డబ్బులు వసూలు చేయసాగారు ముగ్గురు. ఎంపీ మాలోతు కవిత పీఏల పేరుతో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేశారు. ఓవ్యక్తి నుంచి రూ.లక్ష వసూలు చేసిన కేటుగాళ్లు..ఢిల్లీలోని ఓ ఇంటి యాజమాని నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసారు. ఇల్లు అక్రమ నిర్మాణం అంటూ డబ్బులు డిమాండ్ చేసారు ముగ్గురు. రూ.5 లక్షలు డిమాండ్ చేసి లక్షతో సీబీఐకి పట్టుబడ్డారు. రాజీబ్ భట్టాచార్య, సుభాంగిగుప్తా, దుర్గేష్‌ కుమార్‌లను ఎంపీ మాలోతు కవిత క్వార్టర్ లో అరెస్ట్ చేసింది సీబీఐ. మన్మిత్ ‌సింగ్‌ లంబా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ ఇప్పుడు నిందితులను పట్టుకుంది. దీనిపై స్పందించిన ఎంపీ మాలోతు కవిత తనకు ఢిల్లీలో ఎలాంటి పీఏలు లేరన్నారు. అరెస్ట్ అయిన వారిలో దుర్గెష్ తన డ్రైవర్ అని చెప్పారు. తన డ్రైవర్ అయినందునే దుర్గేష్ కు స్టాప్ క్వార్టర్ ఇచ్చినట్లు తెలిపారు. దుర్గెష్ తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చని ఎంపీ మాలోతు కవిత స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement