Thursday, May 16, 2024

ఈసారి వర్షాలు అంతంతమాత్రమే.. ఎల్‌నినో ప్రభావంపై నిపుణుల సూచన

ఈ ఏడాది వర్షాకాలంలో వర్షపాతం సుదీర్ఘ కాలపు సగటు(ఎల్‌పీఏ) కన్నా నాలుగు శాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సారి వేసవికాలంలో వేడిమి సాధారణం కన్నా అధికంగా ఉన్న ట్టు అంచనా వేస్తున్న కారణంగా దేశంలో నిర్దేశిత ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. దీంతో ఇది కరవు లాంటి పరిస్థితికి దారితీయవచ్చు. వర్షాకాలంలో తక్కువ వర్షపాతానికి ఎల్‌నినో పరిస్థితులకు ఆపాదించవచ్చునని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వర్షాకాలంలో ఎల్‌నినో పరిస్థితులు తలెత్తుతాయని, వాటి కారణంగా వర్షాకాలంలో ఆసియా, అమెరికా అంతటా వాతావరణ మార్పులు, పర్యావరణంపై ప్రభావం చూపుతాయని చెప్పారు.

1990 నుంచి 2022 మధ్య 33 సంవత్సరాల్లో 10 సంవత్సరాలను వేర్వేరు తీవ్రతను సంతరించుకున్న ఎల్‌నినో సంవత్సరాలుగా గుర్తించినట్టు ఇండియన్‌ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌లో ప్రిన్సిపల్‌ ఎకనిమిస్ట్‌, పబ్లిక్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ సునీల్‌ సిన్హా తెలిపారు. ”అయితే ఈ 10 సంవత్సరాల్లో ఏడు సంవత్సరాల కాలానికి భారత్‌ ఐదు శాతానికి పైగా తక్కువ వర్షపాతాన్ని నమోదు చేసుకుంది. అలాగే ఈ ఏడు సంవత్సరాల్లో ఐదింటిని కరవు సంవత్సరాలుగా గుర్తించడం జరిగింది” అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement