Sunday, April 28, 2024

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా.. ఫీజుల విషయం తేలకపోవడంతోనే ఈ నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ఇంజనీరింగ్‌ ఫీజుల విషయం కొలిక్కి రాకపోవడంతో రెండో విడత కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 28వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. కానీ టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేయాల్సిన ఫీజుల అంశం కొలిక్కి రాకపోవడంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబర్‌ 11వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

అక్టోబర్‌ 11, 12న రెండో విడత స్లాట్‌ బుకింగ్‌, ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. అదేనెల 12, 13 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు గడువిచ్చారు. 16న రెండో విడత ఇంజనీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించి 18 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement