Sunday, June 4, 2023

మహారాష్ట్రలో దొంగ‌ల బీభ‌త్సం.. కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లో న‌గ‌ల దోపిడీ..

మహారాష్ట్రలోని పర్భణి స్టేషన్‌ శివారులో సిగ్నల్ కోసం ఆగగా ఇదే అదనుగా భావించిన దుండగులు బోగీలోకి ప్రవేశించారు. ప్రయాణికులను బెదిరించి మహిళ మెడలోని గొలుసులు కొట్టేశారు. ఎస్2 బోగీ నుంచి ఎస్11 వరకు మహిళలే టార్గెట్‌గా దోపిడీ చేశారు. 30 మంది ప్రయాణికుల నుంచి బంగారం దోచుకెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పర్భణి స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌కు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకోవాలని కోరారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement