Wednesday, May 1, 2024

ఆ బాలికలపై లైంగిక దాడి జరగలేదు.. మఠాధిపతి శివమూర్తి కేసులో కీలక మలుపు

కర్ణాటక మఠాధిపతి శివమూర్తి మురుగపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు మలుపుతిరిగింది. ఈ కేసులో బాధిత బాలికలకు వైద్యపరీక్షలు నిర్వహించగా, వారిపై లైంగిక దాడి జరగలేదని నిర్ధారణ అయింది. స్వామీజీ శివమూర్తి 2019 నుంచి 2022 వరకు తమను లైంగికంగా వేధించినట్లు ఇద్దరు బాలికలు ఆరోపించారు. దీంతో గతేడాది ఆగస్టు26న ఆయనపై మైసూరులో కేసు నమోదైంది. అనంతరం కేసును చిత్రదుర్గ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ వ్యవహారం విమర్శలకు దారితీయడంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.

కేసు నమోదైన తర్వాత బాధిత బాలికలకు చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నివేదికను తాజాగా ప్రాంతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌లేబొరేటరీకి పంపారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్లు పరీక్షలో వెల్లడికాలేదని, జననాంగాలకు ఎలాంటి గాయాలు లేవని నివేదికలో పేర్కొన్నారు. స్వామీజీపై మరో నలుగురు బాలికలు కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. వారి వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement