Sunday, May 5, 2024

బొగ్గు కొరత లేదు, నెలకు సరిపడా నిల్వలున్నయ్​: ప్రహ్లాద్‌ జోషి

దేశంలో బొగ్గు కొరతపై ఉన్న భయాందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దేశంలో బొగ్గు కొరత లేదని, నెలకు సరిపడా బొగ్గు ఉందని స్పష్టం చేసింది. విద్యుత్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా నిరంతరం పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. దేశంలోని సగానికి పైగా పవర్‌ ప్లాంట్‌లలో అవసరమైన దానికంటే చాలా తక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయని వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. బొగ్గు నిల్వలు నిండుకోవడంతో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందనే ప్రచారం జరిగిన నేపథ్యంలో జోషి స్పష్టత ఇచ్చారు. బొగ్గు కొరత లేదని, కోల్‌ ఇండియా సహా వివిధ ప్రాంతాల్లో 725 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉందని ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. అదే సమయంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో 22 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉందని వివరించారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి నిరంతరం పెరుగుతున్నది తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 8 శాతానికి పైగా పెరిగి 77 మిలియన్‌ టన్నులు దాటిందన్నారు. కోల్‌ ఇండియా ఉత్పత్తి 4 శాతానికి పైగా పెరిగి 62 మిలియన్‌ టన్నులకు చేరిందని వివరించారు. ఈ సంవత్సరం వేసవిలో ఉష్ణోగ్రత పెరగడంతో విద్యుత్‌ వినియోగం పెరిగిందని, పవర్‌ ప్లాంట్‌లో బొగ్గు కొరత ఏర్పడిందని, అయితే రైల్వే మంత్రిత్వ శాఖ బోగీల సంఖ్యను 20 శాతం పెంచడంతో బొగ్గు సరఫరా మెరుగుపడిందని అధికారులు వివరించారు. ఏప్రిల్‌ 2022 మొదటి 15 రోజుల్లో గృహ విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయికి చేరుకుందన్నారు. పవర్‌ ప్లాంట్‌లో బొగ్గు కొరత కారణంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడుతుందని ఆలిండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ హెచ్చరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement