Tuesday, May 14, 2024

ఏపీ హైకోర్టు తరలింపు ప్రతిపాదనేదీ లేదు.. టీడీపీ, వైసీపీ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం బదులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై తమకు పూర్తిస్థాయి ప్రతిపాదనలేవీ అందలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు పరిధిలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలన్నారు. ఆ తర్వాత తరలింపుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రిన్సిపల్ సీటును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని కోరుతూ 2020 ఫిబ్రవరిలో ఏపీ సీఎం ప్రతిపాదనలు పంపించారని గుర్తు చేశారు.

కానీ ఇప్పటివరకు అలాంటి పూర్తిస్థాయి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని జవాబులో పేర్కొన్నారు. హైకోర్టును తరలించాలంటే రాష్ట్ర హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి నిర్ణయించుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. హైకోర్టు నిర్వహణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని చెప్పారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement