Thursday, May 2, 2024

కామన్వెల్త్​ గేమ్స్​లో ఫైనల్స్​కి చేరిన విమెన్​ క్రికెట్​ టీమ్​.. ఆస్ట్రేలియాపై గెలిస్తే గోల్డ్​ మెడల్​ ఖాయం!

కామన్వెల్త్ గేమ్స్‌లో విమెన్స్ క్రికెట్ జట్టు ఆడటం ఇదే తొలిసారి. ఇక బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఫైనల్‌కి చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు ఆస్ట్రేలియాతో తలపడనుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈరోజు రాత్రి 9:30 గంటలకి ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. నిన్న (శనివారం) జరిగిన సెమీ ఫైనల్-1లో ఇంగ్లాండ్‌ని 4 పరుగుల తేడాతో ఓడించిన భారత్ ఫైనల్‌కి చేరింది. జులై 29న ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే భారత జట్టు 3 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అయితే.. ఆ తర్వాత పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో, బార్బడోస్‌పై 100 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ చేరిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. సెమీ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్​ గెలిస్తే ఇండియా క్రికెట్​లోనూ గోల్డ్​ మెడల్​ సాధించడం ఖాయం.

ఇక న్యూజిలాండ్‌ని 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా తుది పోరుకి అర్హత సాధించింది. ఆస్ట్రేలియా టీమ్ ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఫస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై గెలిచిన ఆస్ట్రేలియా టీమ్.. ఆ తర్వాత బార్బడోస్‌పై 9 వికెట్ల తేడాతో, పాకిస్థాన్‌పై 44 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కి చేరింది. అనంతరం సెమీ ఫైనల్-2లో న్యూజిలాండ్‌ని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి జైత్రయాత్రని కొనసాగిస్తోంది. దీంతో.. ఈరోజు ఫైనల్ కూడా ఆసక్తిగా ఉండబోతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement