Sunday, April 28, 2024

ఇండియాన్​ ఎయిర్​క్రాఫ్ట్​ విక్రాంత్​ని సందర్శించిన మోహన్​లాల్​..

సౌత్​ఇండస్ట్రీలోనే కాకుండా భారత చిత్రసీమలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ సూపర్​స్టార్​ మోహన్​లాల్​. ఇప్పటికీ కుర్ర హీరోలకు దీటుగా వైవిధ్యమైన సినిమాలను చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. అయితే ఇండియన్​ ఆర్మీలో లెఫ్టినెంట్​ కర్నల్​​ హోదాలో కూడా ఉన్న ​ఆయన తాజాగా కొచిన్​ షిప్​యార్డ్​లో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎయిర్​క్రాఫ్ట్​ క్యారియర్​(ఐఏసీ) విక్రాంత్​ను సందర్శించారు. అధికారులు, సిబ్బందితో కలిసి కాసేపు ముచ్చటించి అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈయనతో పాటు ​ఇండియన్ ​ఆర్మీ రిటైర్డ్​ మేజర్​, నటుడు, దర్శకు డు రవి కూడా విక్రాంత్​ను సందర్శించారు. అనంతరం విక్రాంత్​ను సందర్శించడం ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని సోషల్ మీడియాలో ట్వీట్​ చేశారు. అక్కడ దిగిన ఫొటోలను షేర్​ చేశారు.

“భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహక నౌక(ఐఏసీ)ను సందర్శించడం గౌరవంగా ఉంది. సందర్శించే అవకాశం రావడాన్ని గొప్పగా భావిస్తున్నాను. ఐఏసీ విక్రాంత్.. నౌకాదళాన్ని మరింత పటిష్టం చేయడం సహా భారతదేశ నౌకానిర్మాణ సామర్థ్యాలను చాటి చెబుతుంది” అని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఆయన అలోన్​, మాన్​స్టర్​, బరోజ్​ సహా మరో ఐదు చిత్రాల్లో నటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement