Thursday, May 9, 2024

ది వారియ‌ర్ కి -U/A సర్టిఫికెట్

త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న తెలుగు చిత్రం ది వారియర్. శ్రీనివాస చిట్టూరి నిర్మాత‌. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలారు. U/A సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇక థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. హీరో రామ్ ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా ఇది. ఇక రేడియో జాకీగా కృతి శెట్టి కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు మాస్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యాయి. చాలా కథల తరువాత ఈ కథకి ఓకే చెప్పాడ‌ట రామ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement