Monday, May 6, 2024

INDvsIRE | కొద్దిసేప‌ట్లో రెండో టీ20 ప్రారంభం.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాంగ్

ఐర్లాండ్ లోని డబ్లిన్ విలేజ్ స్టేడియం వేధికగా ఐర్లాండ్​తో భారత జట్టు టీ20 మ్యాచ్​లు ఆడుతోంది. ఇవ్వాల (ఆదివారం) రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మూడు మ్యాచ్ ల‌ టీ20 సిరీస్ లో భాగంగా.. తొలి మ్యాచ్ లో వాన కార‌ణంగా (డీఎల్ఎస్ ప్ర‌కారం) మ్యాచ్ భార‌త్ మ్యాచ్ సొంతం చేసుకుంది. ఇక‌.. ఇవ్వాల జ‌రిగే మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ద‌క్కించుకునే ప్ర‌య‌త్నంలో ఉంది​. ఈ మ్యాచ్ లో ఆథిద్య జ‌ట్టు ఐర్లాండ్ గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని చూస్తోంది.

కాగా, ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బౌలింగ్ ఎంచుకోగా మ‌రికొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్ లోని తొలి మ్యాచ్ లో ఐర్లాండ్‌ను ఏడు వికెట్లకు 139 పరుగులకు పరిమితం చేసిన భార‌త్.. చేజింగ్ లో ఎడతెగని వర్షం కార‌ణంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌లకు తమ సామ‌ర్ధ్యాన్ని నిరూపించుకునే అవకాశాం క‌ల‌గ‌లేదు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ రెండు పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. ఇక దీంతో రెండో గేమ్‌లో పూర్తి మ్యాచ్ ఆడాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

- Advertisement -

తుది జట్లు..

ఐర్లాండ్: 1 ఆండ్రూ బల్బిర్నీ, 2 పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), 3 లోర్కాన్ టక్కర్ (వారం), 4 హ్యారీ టెక్టర్, 5 కర్టిస్ కాంఫర్, 6 జార్జ్ డాక్రెల్, 7 బారీ మెక్‌కార్తీ, 8 మార్క్ అడైర్, 9 క్రెయిగ్ యంగ్, 10 జోష్ లిటిల్, 11 తెలుపు

భారత్: 1 యశస్వి జైస్వాల్, 2 రుతురాజ్ గైక్వాడ్, 3 తిలక్ వర్మ, 4 సంజు శాంసన్ (వికెట్), 5 రింకూ సింగ్, 6 శివమ్ దూబే, 7 వాషింగ్టన్ సుందర్, 8 ప్రసిద్ధ్ కృష్ణ, 9 జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), 10 అర్ష్‌దీప్ సింగ్, 11 రవి బిష్ణోయ్

Advertisement

తాజా వార్తలు

Advertisement