Monday, April 29, 2024

Delhi: భారత ప్రతిష్ట పెంచడంలో విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల పాత్ర కీలకం.. ఆర్థిక మంత్రి నిర్మలా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో చదువుతున్న భారతీయ విద్యార్థులు తమ మూలాలను మర్చిపోవట్లేదని, దేశ ప్రతిష్టను ఇతర దేశాలలో పెంచడంలో వారి పాత్ర కీలకమని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్, జీవీఎల్ అక్కడి విశ్వవిద్యాలయాలైన యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, హార్వర్డ్ యూనివర్శిటీ, అమెరికన్ యూనివర్శిటీ, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలలో చదువుతున్న భారతీయ విద్యార్థులతో జరిగే ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆర్థిక మంత్రి సమాధానాలిచ్చారు. దాదాపుగంటపాటు జరిగిన సమావేశంలో ఎంపీ జీవీఎల్ కూడా విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం నిర్మలా సీతారామన్, జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. భారత్ తిరిగి వచ్చాక అక్కడి సమస్యలపై చర్చిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement