Friday, May 17, 2024

ఫోన్ నా ద‌గ్గ‌రే ఉంది, ఇవ్వాలంటే ఓ కండిష‌న్.. ఊర్వశి రౌతులాకు మెసేజ్ చేసిన‌ అజ్ఞాత వ్యక్తి

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలా భార‌త్ పాక్ మ్యాచ్ లో తన గోల్డెన్ ఐఫోన్‌ను పోగొట్టుకుంది. ప్రపంచకప్ టోర్నీ లో భాగంగా అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరిగిన భారత్‌ – పాక్‌ మ్యాచ్‌లో ఆమె తన 24 క్యారెట్ల బంగారు ఐఫోన్ పోగొట్టుకుంది. దీనిపై పోలీసులకు కంప్లైంట్‌ కూడా చేసింది ఊర్వశి. దాంతో పాటు సోష‌ల్ మీడియా వేదికాగా త‌న ఫోన్ తనకు తిరిగి తెచ్చి ఇచ్చిన వారికి రివార్డు కూడా ప్రకటించింది. కాగా, తాజాగా ఆ ఫోన్‌ ఆచూకీ నటికి తెలిసింది.

ఆ గోల్డెన్ ఐఫోన్ తన వద్ద ఉందంటూ ఓ వ్యక్తి ఊర్వశికి మెయిల్‌ చేశాడు. అయితే, దాన్ని తిరిగి ఇచ్చేందుకు ఓ కండిషన్‌ పెట్టాడు. ‘మీ ఫోన్‌ నా దగ్గర ఉంది. మీకు ఇవ్వాలంటే నాకు ఓ సాయం చేయాలి. నా సోదరుడు క్యాన్స్‌ర్‌తో బాధపడుతున్నాడు. అతడిని క్యాన్సర్‌ బారి నుంచి రక్షించేందుకు సాయం చేయాలి’ అంటూ మెయిల్‌ చేశాడు. దీనికి స్పందించిన ఊర్వశి ఓకే అంటూ రిప్లే ఇచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఊర్వశి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది. అయితే, ఆ మెయిల్‌ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలను మాత్రం నటి వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement