Sunday, May 5, 2024

ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ పై మనసు పడ్డ కామాంధుడు !!

మనకి ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే… డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అలాంటి డాక్టర్ కే ప్రాబ్లెమ్ గా మారాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి జుట్టు రాలిపోతుందని ఓ హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ ఓ లేడీ డాక్టర్ ని చూసి మనసు పడ్డాడు. తనతో స్నేహం చేయాలని ఒత్తిడి చేశాడు. తనకు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారని ఆమె చెప్పినా ఒప్పుకోలేదు. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లో ఓ ప్లాట్ ని అద్దెకు తీసుకున్నాడు. ఆమె ప్లాట్ లో ఎవరూ లేని సమయంలో అక్కడికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతేకాదు ఆమె కారుకు జిపిఎస్ ని కూడా అమర్చి ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునేవాడు. ఇక విశ్వనాధ్ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతుండటం తో డాక్టర్ ప్లాట్ ను ఖాళీ చేసింది.

అయినా విశ్వనాధ్ ఆమెను వదల్లేదు. దీంతో డాక్టర్ ఆమె భర్తకు జరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే భర్త విశ్వనాథ్ కు వార్నింగ్ ఇచ్చేందుకు బయలుదేరాడు. అప్పటికే విశ్వనాధ్ టిఆర్ఎస్ నేత శ్రీకాంత్ గౌడ్ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. తగిన బుద్ధి చెప్పాలని శ్రీకాంత్ గౌడ్ కు జరిగిన విషయాన్ని వివరించాడు. అయితే శ్రీకాంత్ గౌడ్ రివర్స్ లో ఇక్కడనుండి వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఆ బాధిత డాక్టర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement