Friday, April 26, 2024

ఓపెన్‌కాస్టును సందర్శించిన జీఎం

శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఓపెన్‌కాస్టును ఏరియా జీఎం ఎం.సురేష్‌ సందర్శించారు. సిహెచ్‌పీలో అధికారులతో కలిసి పరిశీలించి బొగ్గు రవాణా గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిఎల్‌ బంకర్‌ను సందర్శించి వ్యాగిన్‌ లోడింగ్‌ సిస్టమ్‌ను పరిశీలించారు. ఇన్‌పుట్‌ క్రషర్‌ పనితీరును పరిశీలించి అక్కడ జరుగుతున్న పని విధానాలపై అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జీఎం వెంట ఉపరితల గని ప్రాజెక్ట్‌
అధికారి జి.పురుషోత్తం రెడ్డి, మేనేజర్‌ జనార్దన్‌, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, రక్షణాధికారి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement