Friday, May 3, 2024

నగదు వద్ద, డిజిటల్‌ ముద్దు.. పెరిగిన క్యాష్ లెస్ సేవ‌లు

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి: దేశంలో డిజిటల్‌ సేవలను అన్ని రంగాలకు విస్తరించాలనే కేంద్ర ప్రభుత్వ కాంక్షకు అనుగునంగా హైదరాబాద్‌ నగరం నగదు రహిత లావాదేవీల్లో దూసుకు పోతోంది. కూరగాయలు, పాల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకు అన్నింటా క్యాష్‌ లెస్‌ సేవలు అందుబాటులో ఉండటంతో ప్రజలు వాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. గతంలో లాగా నగదు చెల్లింపులకన్నా ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ వైపే నగర ప్రజలు మొగ్గు చూపుతున్నారు. జేబులో చిల్లి గవ్వ లేకున్నా నగదు రహిత లావాదేవీల ద్వారా అన్నింటిని ఖరీదు చేసే పరిస్థితి అందుబాటులో ఉండటంతో నగదు రహిత కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. డిజిటల్‌ సేవల వల్ల డబ్బుకు సెక్యూరిటీ కూడా ఉండటంతో ప్రజలు తమ నిత్యజీవితంలో వాటిపైనే ఎక్కువగా ఆధార పడుతున్నారు. భవిష్యత్‌ ఈ సేవల రంగం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.

బెంగుళూర్‌ తర్వాత మనమే నెంబర్‌ వన్‌..

నగదు రహిత లావాదేవీల్లో బెంగుళూర్‌ తర్వాత హైదరాబాద్‌ నగరం నెంబర్‌ వన్‌గా నిలిచింది. గడిచిన జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు డిజిటల్‌ సేవల రంగంలో నగరం ఘననీయమైన వృద్ధిని సాధించింది. 9 నెలల కాలంలో నగరంలో మొత్తం రూ.9,500 కోట్ల విలువ చేసే 34 మిలియన్ల లావా దేవీలు జరిగాయి. మూడవ స్థానంలో నిలిచిన ముంబాయి నగరం రూ.9,370 కోట్ల విలువ చేసే 32.6 మిలియన్ల లావాదేవీలు నిర్వహించింది. 7,400 కోట్ల విలువ చేసే 26.6 మిలియన్ల లావాదేవీలు నిర్వహించి చెన్నై నగరం నాలుగో స్థానంలో నిలిచింది. పుణే నగరం 5,793 కోట్ల విలువ చేసే 26.3 మిలియన్ల లావాదేవీలను నిర్వహించి దేశంలో ఐదవ స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement