Monday, April 29, 2024

పిల్లలకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత

ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ఏపీ ప్రభుత్వం స్వార్ధబుద్దితో వ్యవహరిస్తుందన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తుల విలువ పెరగడం వల్లే ప్రభుత్వం వాటిపై కన్నేసింది.
ఎంతో మందికి విద్యను భోదించి ఉన్నత స్థాయికి చేర్చిన చరిత్ర ఎయిడెడ్ పాఠశాలలకుందన్నారు. తక్షణం ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.

కర్ణాటకలో కరోనా ధర్డ్ వేవ్ కేసులు నమోదువుతున్నాయి.ఏపీలో ఈ నెల 16 నుంచి ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించనుంది. పాఠశాలల నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే భారీ ఇబ్బందులు తప్పవు. ఏది జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు తులసిరెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement