Thursday, April 18, 2024

ఉక్రెయిన్ లో ఉపాసన @ఆర్ ఆర్ ఆర్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు గా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది.

కాగా రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసనన కూడా ఆర్ ఆర్ ఆర్ సెట్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉపాసన. రామ్ చరణ్ ఐడితో ఉన్న ట్యాగ్ మెడలో వేసుకుని కనిపించింది. అలాగే తనను జాగ్రత్తగా చూసుకున్న పూజా ఎస్ ఎస్ కార్తికేయ, రమ గారికి, ఎస్ ఎస్ రాజమౌళి గారికి, చిత్ర యూనిట్ కి థాంక్స్ తెలిపారు. అందర్నీ కూడా త్వరలో హైదరాబాద్ లో కలిసేందుకు చూస్తున్న అంటూ చెప్పుకొచ్చారు ఉపాసన.

Advertisement

తాజా వార్తలు

Advertisement