Thursday, April 25, 2024

అల్లరి నరేష్ సభ స్టార్ట్ అయింది

నాంది సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు హీరో అల్లరి నరేష్. అయితే ప్రస్తుతం సతీష్ మల్లంపాటి దర్శకుడిగా… సభకు నమస్కారం సినిమా చేస్తున్నాడు ఈ అల్లరోడు. మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే గురువారం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశాన్ని నరేష్ కుమార్తె అయాన క్లాప్ కొట్టగా పోకూరి బాబూరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విజయ్ కనకమేడల ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. నరేష్ కెరీర్లో 58వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా ఆయన పుట్టిన రోజుసందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.అలాగే చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా… శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement