Saturday, April 27, 2024

TS | అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి పరీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో ఖాళీగా ఉన్న 78 అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు మంగళవారం పరీక్ష జరగనున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీఎస్‌పీఎస్‌సీ పూర్తి చేసింది.

మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతిలో పరీక్షను నిర్వహించనున్నారు. అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఉన్న నిబంధనలను తప్పకుండా పాటించాలని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement