Monday, April 29, 2024

ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌పై సిల్వర్‌వుడ్‌పై వేటు..

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ను ఆ పదవి నుంచి ఈసీబీ తొలగించింది. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఒక్క టెస్టులోనూ గెలవలేకపోయింది. కమిన్స్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌ను 4-0తో సొంతం చేసుకుంది. ఆ సిరీస్‌లో తొలి మూడు టెస్టులను వరుసగా గెలుచుకున్న ఆసీస్‌ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది.

అనంతరం నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ త్రుటిలో తప్పించుకోవడంతో ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చివరి టెస్టును గెలుచుకున్న ఆస్ట్రేలియా 4-0తో గెలుచుకుంది. ఈక్రమంలో కెప్టెన్‌ జోరూట్‌, కోచ్‌ సిల్వర్‌వుడ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కాగా విండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు అండ్రూ స్ట్రాస్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement