Saturday, April 27, 2024

గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలో లియో షూటింగ్.. వీడియో రిలీజ్ చేసిన మేక‌ర్స్

ఈ ఏడాది అక్టోబర్ 19న లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందుకోసం చిత్రబృందం గడ్డకట్టించే చలిలో షూటింగ్ చేసింది. 56 రోజుల సుదీర్ఘ షెడ్యూల్​ కు సంబంధించిన ఓ వీడియోను లియో చిత్రబృందం విడుదల చేసింది. కశ్మీర్ షెడ్యూల్​లో తమ సిబ్బంది ఎంతలా కష్టపడిందో వారి మాటల్లోనే చూపించారు. కశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో లియో షూటింగ్ జరిగింది. ప్రధాన క్రాఫ్ట్స్ అన్నీ పనిచేశాయి. అయితే కశ్మీర్​లో షూటింగ్ కావడంతో మైనస్​ 10 డిగ్రీల టెంపరేచర్​లో పనిచేయాల్సి వచ్చింది. చలికి వణికిపోతూనే షూటింగ్ వర్క్ కొనసాగించారు. రాత్రి పగలు షూటింగ్ కొనసాగింది. ముఖ్యంగా అక్కడి చలి, మంచు, వర్షానికి ఏమాత్రం ఆగిపోకుండా షూటింగ్ పనులు నిర్వహించారు అని మేకర్స్​ తెలిపారు.లియో’ చిత్రాన్ని ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్​పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీశ్​ పళనిసామి రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరో విజయ్ సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మైస్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

YouTube video

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement