Tuesday, April 30, 2024

రోడ్డు పైకొచ్చి జనాలకు షేక్ హ్యాండ్ ఇచ్చిన కరోనా బాధితుడు

సంగారెడ్డి జిల్లా కంగ్టిలో కరోనా పేషంట్ హల్ చల్ చేశాడు. రోడ్డు పైకి వచ్చి మార్కెట్ లో అందరిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.రెండు రోజుల కిందట సదరు వ్యక్తికి పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ లో అధికారులు ఉంచారు. అయితే ఇంట్లో వాళ్ళ చూడకుండా బయటకు వచ్చిన వ్యక్తి హడావుడి చేశాడు.

విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది పీపీఈ కిట్ లు ధరించి కరోన బాధితుడిని పట్టుకుని హైదరాబాద్ కు తరలించారు. కాగా మతి స్థిమితంలేక ఇలా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే అధికారులు మాత్రం గ్రామస్తులందరికి టెస్టులు చేయడానికి సిద్ధం అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement