Thursday, May 2, 2024

కలివికోడి అన్వేషణకు నిధులు విడుదల చేసిన కేంద్రం.. కొనసాగనున్న పరిశోధన ప్రాజక్టు

కడప, ప్రభన్యూస్‌ : ప్రపంచంలోనే అరుదైన అంతరించి పోయిన పక్షి జాతుల్లో చేరి 36 ఏళ్ళ క్రితం మళ్లి కనిపించి ఆ తర్వాత అదృశ్యమైన కలివికోడి అన్వేషణను కొనసాగించేందుకు కేంద్రప్రభుత్వం రూ.50 లక్షలు నిధులు విడుదల చేసింది. కలివి కోడి వుందో లేదో ఇక కనిపించదేమో అనే అభిప్రాయానికి వస్తున్న సమయంలో 28 నెలల క్రితం 2019 డిసెంబర్‌ 29న దాని కూత వినిపించడం ఆ కూతను సాంకేతికంగా పరిశీలిస్తే నిర్దారణ కావడంతో కలివికోడి జాడ దొరుకుతుందనే ఆశలు ఈ పక్షి ప్రేమికుల్లో రేకేత్తాయి. కలివి కోడి కోసం ఎంతో కాలంగా బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీకి చెందిన శాస్త్రవేత్త జగన్నాథం ఎంతో కాలంగా అన్వేషిస్తూనే వున్నారు. ఈయన కలివికోడి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే వున్నాడు. తాజాగా కేంద్రప్రభుత్వం కలివికోడి పై వున్న ఆసక్తితో దాని కోసం పరిశోధనకు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది.

36 ఏళ్ళ క్రితం కనిపించిన కలివికోడి..

ప్రపంచంలోనే అరుదైన కలివికోడి 35 ఏళ్ల క్రితం కంటే 1986 లో కనిపించింది. 1900 సంవత్సరంలో అంతరించి పోయిన పక్షి జాబితాలో చేరిన ఈ పక్షి అప్పట్లో కనిపించి ఆ తర్వాత మాయమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని కలివికోడి కడప జిల్లా లంకమల అభయారణ్యం లో గల కొండూరు అటవీ ప్రాంతంలో ఆవాసం ఏర్పరచుకున్నట్లుగా గుర్తించారు. అక్కడే 1986లో గొర్రెల కాపరి ఐతన్నకు ఈ పక్షి కనిపించింది. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని కలివికోడి ఆవాస ప్రాంతంగా గుర్తించారు. అప్పటి నుండి దీని ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు, అన్వేషణలు చేస్తున్నా జాడ కనిపించడం లేదు. 36 ఏళ్ళుగా ఎవరి కంట పడని ఈ కలివికోడిని గుర్తించేందుకు పలు సంస్థలు ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి. దీని ఆవాస ప్రాంతాల్లో అధునాతనమైన కెమెరాలు, వాయిస్‌ రికార్డర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో పలు రకాల వన్య ప్రాణులు పడుతున్న కలివికోడి మాత్రం కనిపించలేదు.

ఎన్నో పరిశోధనలు..

అంతరించిపోయిందనుకున్న కలివికోడి 1986 జనవరి 5న ఐతన్నకు కనిపించింది. రెండు కలివికోడిలు కనిపించగా ఒకటి పరారైంది. ఒకటి శాస్త్రవేత్తలు వచ్చి చూసే లోపే చనిపోయింది. ఆ తర్వాత వాటి జాడ కోసం పలు సంస్థలు అన్వేషిస్తూనే వున్నాయి. కలివికోడి అంతరించి పోయిన జాబితాలో చేరిన సలీం అనే పర్యావరణ శాస్త్రవేత్త ఈ పక్షి బ్రతికే వుంటుందన్న తలంపుతో దీని ఆచూకీ కోసం పలు ప్రయత్నాలు చేశారు. 1932 లో ఆయన హైదరాబాదు అర్నితా లాజికల్‌ సర్వే ప్రాజెక్టులో భాగంగా ఈపక్షి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ అప్పట్లో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తిరిగి 1975, 1976 సంవత్సరంలో బాంబే నేచుర్‌ హిస్టరీ సొసైటీ, స్మిత్‌ సానియర్‌ ఇనిస్టిట్యూట్‌, వరల్డ్‌ వైడ్‌ లైఫ్‌ అం డ్‌ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఈ పక్షి కోసం ప్రయత్నాలు చేపట్టారు. అప్పుడు కనిపించలేదు. ఆ తర్వాత 1981లో గవర్నమెంటు ఆఫ్‌ ఇండియా యునైటెడ్‌ స్టేట్‌ షిప్‌ అండ్‌ వైడ్‌ లైఫ్‌ సమిష్టితో కలసి తిరిగి ప్రాజెక్టును చేపట్టింది. అప్పటికే గ్రేస్‌ ఇండియన్‌ బస్టర్‌ (బట్టమేక) పై పరిశోదనలు చేస్తున్న భరత్‌ భూషణ్‌కు కలివికోడి ఆనవాళ్లు గుర్తించే పనిని అప్పగించారు. ఎన్‌హెచ్‌ఎస్‌ సంస్థ పరిశోధన చేసినా కనిపించలేదు. 2018 జులైలో కలివికోడి కోసం అశోక్‌ ట్రస్ట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఎకాలజీ ఎన్విరాన్‌మెంట్‌ (ఏ ట్రీ సంస్థ) అటవీశాఖ అనుమతితో కలివికోడి అవాస ప్రాంతాలలో అన్వేషణ మొదలు పెట్టింది. ఇలా కలివికోడి కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా కనిపించలేదు కానీ 2019 జనవరి 29న బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ (జిఎన్‌హెచ్‌ఎస్‌) కు జగన్నాథం కెమెరాల్లో కలివికోడి కూత రికార్డు అయినట్లు గుర్తించడంతో ఈ కోడి కోసం పరిశోదన పట్ల మళ్లిd ఆసక్తి పెరిగింది. తాజాగా విడుదలైన రూ.50 లక్షలతో కలివి కోడి ఆవాస ప్రాంతాల్లో ఆధునాతనమైన వాయిస్‌ రికార్డర్లు, కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం ఈ నిధులు ఖర్చు చేస్తారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement