Saturday, May 4, 2024

Order Order | కుక్కల దాడిలో బాలుడి మృతి కేసు.. సుమోటాగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయిన బాలుడి ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్​ రెస్పాండ్​ అయ్యారు. ఇట్లాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, అధికారులను అప్రమత్తం చేస్తున్నట్టు తెలిపారు. అయితే.. ఈ దారుణ ఘటనలో బాలుడి చనిపోయిన విషయమై తెలంగాణ హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. కాగా, ఇవ్వాల (బుధవారం) ఒక్కరోజే హైదరాబాద్​లో రెండు చోట్ల, కరీంనగర్​, ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క కుక్కకాటు ఘటనలు జరిగాయి.

ఇక.. గ్రైటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (జీహెచ్​ఎంసీ) అధికారులు వీధికుక్కల విషయంలో సీరియస్​ యాక్షన్​ ప్లాన్​ తీసుకోబుతున్నట్టు తెలిపారు. స్కూళ్లు, మార్కెట్​ ప్రదేశాల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా హైదరాబాద్​ మహానగరంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓ కాల్​ సెంటర్​ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీని కోసం 040-2111111 హెల్ప్ లైన్‌కి ఎప్పుడైనా క‌ల్ చేసి కంప్లెయింట్ చేయ‌వ‌చ్చ‌ని సూచించారు. దీంతో కుక్క‌లు ఎక్కువ‌గా ఉండే చోట్ల‌కు జీహెచ్ ఎంసీ సిబ్బంది వ‌చ్చి వాటిని తీసుకెళ్తార‌ని, కుక్క‌ల సంత‌తి పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీస‌కుంటార‌ని అధికారులు వెల్ల‌డించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement