Thursday, April 25, 2024

Dogs Attack | ఖ‌మ్మం జిల్లాలో మ‌రో ఘోరం.. 16నెలల బాలుడిపై వీధి కుక్క దాడి

కొణిజర్ల, (ప్రభ న్యూస్) : ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలోని ఎస్సీ కాలనీలో 16 నెలల చిన్నారి బాలుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం జ‌రిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. పెద్దగోపతి ఎస్సీ కాలనీకి చెందిన ఊటుకూరి గణేష్ కుమారుడు సిద్ధార్థ 16 నెలల బాలుడు తమ ఇంటి ముందు రోడ్డుపై ఆడుతుండగా అకస్మాత్తుగా కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

ఈ ఘటనలో చిన్నారి బాలుడు సిద్ధార్థకు కంటి భాగంలో తీవ్రంగా గాయం అయ్యింది. బాలుడిని హుటాహుటిన‌ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ప్రైవేటు ఆస్ప‌త్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు రెడీ అయ్యారు. గ్రామంలో విచ్చలవిడిగా కుక్కలు తిరుగుతూ.. చిన్న పిల్లలపై దాడులు చేస్తుండటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement