Saturday, May 18, 2024

ల‌వ్ స్టోరీ మూవీ మ‌ర‌చిపోలేని జ్ఞాప‌కాలు అందించింది-నాగ‌చైత‌న్య‌

గత ఏడాది నాగ చైతన్య ‘లవ్ స్టోరీ చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు. శేఖర్ కమ్ముల తనదైన శైలిలో భావోద్వేగాలు జోడించి కులవ్యవస్థపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ ఆడియన్స్ ని ఫిదా చేసింది. ఈ చిత్రం విడుదలై నేటికి ఏడాది గడుస్తోంది. దీనితో నాగ చైతన్య ఈ మూవీని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు, ఈ మూవీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. ఈ మూవీ నాకు ఎన్నో పాటలు నేర్పింది. ఎప్పటికి మరచిపోలేని జ్ఞాపకాలు అందించింది అంటూ నాగ చైతన్య ట్వీట్ చేశారు.

https://twitter.com/chay_akkineni/status/1573543083286745089

Advertisement

తాజా వార్తలు

Advertisement