Thursday, April 25, 2024

జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి… ఇద్దరు జవాన్లు సహా నలుగురి మృతి

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ లో పోలీసులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఓ పోలీసు సహా ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను సైనిక ఆసుపత్రికి తరలించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. మొదట గ్రనేడ్లు విసిరి, ఆపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement