Tuesday, April 16, 2024

ఢిల్లీ భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లజపతి నగర్ సెంట్రల్ మార్కెట్ లోని ఓ బట్టల షోరూంలలో మంటలు చెలరేగాయి. ఉదయం 10.20 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి 30 ఫైర్​ ఇంజిన్లను తరలించిన అధికారులు.. మంటలు అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. 100 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement