Sunday, April 28, 2024

కణ్వర్‌ యాత్రకు ఉగ్ర ముప్పు.. రాష్ట్ర ప్రభుత్వాలకు హోంశాఖ హెచ్చరిక

ఉత్తరాది రాష్ట్రాలలో ప్రముఖంగా నిర్వహించే కణ్వర్‌ యాత్రకు ఉగ్ర సంస్థలనుంచి ముప్పు ఉందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ఈ మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించింది. గురువారంనుంచి ప్రారంభమైన కణ్వర్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్న కొన్ని విప్లవ వర్గాలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని, యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించింది. శుక్రవారంనాడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తారాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లి, రాజస్థాన్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలలో కణ్వర్‌ యాత్రకు అత్యంత ప్రాధాన్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో కణ్వర్‌ యాత్రికులు ప్రయాణించే రైళ్లలో భద్రతను మరింత పెంచాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రైళ్లలో భద్రతా బలగాల సంఖ్యను పెంచనుంది. కణ్వర్‌ యాత్రికుల కేసం ఢిల్లి ప్రభుత్వం 175 శిబిరాలు ఏర్పాటు చేసింది. మహా శివుని భక్తులు హరిద్వార్‌, రిషేకేశ్‌ వరకు యాత్రగా వెళ్లి గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, గంగాజలాలను తమతో తీసుకువచ్చి తమ తమ ప్రాంతాలలోని ఆలయాల్లో శివలింగాలకు అభిషేకం చేయడం ఈ యాత్రలో ప్రధాన సన్నివేశం.

కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లపాటు నిలియిపోయిన ఈ యాత్ర ఈ ఏడాది మళ్లి నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు 15 రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రికులంతా కలిసే హరిద్వార్‌ క్షేత్రంలో భద్రతను పెంచారు. కొత్తగా సీసీ కెమేరాలను అమర్చారు. డ్రోన్‌లతో పర్యవేక్షణ చేస్తున్నారు. బాంబుస్క్వాడ్‌లను రంగంలోకి దింపారు. హరిద్వార్‌ పరిసర ప్రాంతాలను 12 సూపర్‌ జోన్లు, 31 జోన్లు, 133 సెక్టార్లుగా విభజించి 10వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. త్రిశూలాలవంటి వాటితో వచ్చే శివభక్తులు సహా ఎవరినీ అనుమతించబోరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement