Sunday, April 28, 2024

Encounter : జ‌మ్మూలో ఉగ్ర‌వాదుల కాల్పులు… జాడ‌కోసం సెర్చ్ ఆప‌రేష‌న్‌

జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు ఇవాళ‌ తెల్ల‌వారుజామున‌ కాల్పులు జ‌రిపారు. షోపియాన్ జిల్లాలోని ఛోటిగామ్ ప్రాంతంలో కాల్పులు ప్రారంభమైనట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ లో తెలిపారు.

షోపియాన్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఎన్ కౌంటరులో పాల్గొన్నారని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్‌లో తెలిపారు. కుల్గాం జిల్లాలోని హడిగాం గ్రామంలో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన రెండు రోజుల తర్వాత షోపియాన్‌లో ఈ సంఘటన జరిగింది. భద్రతాబలగాలు ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల జాడ కోసం సెర్చ్ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement