Thursday, May 16, 2024

TS | టెన్త్‌ వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదలైంది. ఈమేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ను ఇవ్వాల (గురువారం) విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి చివరి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో పది చదువుతున్న విద్యార్థుల నుంచి వార్షిక పరీక్షల ఫీజు వసూళ్లు చేయాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

నవంబర్‌ 17వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 1 వరకు, రూ.200తో డిసెంబర్‌ 11, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.

మూడు సబ్జెక్టులు అంత కంటే తక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125, వొకేషనల్‌ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే పట్టణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.24వేలు, గ్రామీణా ప్రాంతాల్లో చదివే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.20వేలు ఉంటుందో అలాంటి వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే దీనికి మండల్‌ రెవెన్యూ అధికారి నుండి ధృవపత్రం సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement