Sunday, May 12, 2024

Telangana | కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి.. తెలంగాణ ఎప్పటికీ తలవంచదు: ఎమ్మెల్సీ కవిత

కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచదని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీ-సులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. నోటీసులు విచారణల పేరుతో తమను భయపెట్టలేరని స్పష్టం చేశారు. విశేష ప్రజాబిమానమున్న బీఆర్‌ఎస్‌ పార్టీని, అధినేత కేసీఆర్‌ను రాజకీయంగా ఎదురించలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : పోరాడి సాధించుకున్న తెలంగాణాలో ఇలాంటి కుట్రలకు ఆస్కారం లేదని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ముమ్మాటికీ ఇది రాజకీయ కుట్రేనని, బురదజల్లే ప్రయత్నంలో భాగమేనని వెల్లడించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎవ్వరికీ భయపడబోదని, కుతంత్రాలను తిప్పికొట్టే సమయం త్వరలోనే ఉందని హెచ్చరించారు. ఇకనైనా చిల్లర రాజకీయాలకు స్వస్తి పలుకాలని కవిత హితవు పలికారు.

ఈ క్రమంలో విచారనకు విధిగా హాజరవుతారని, చట్టాలను గౌరవించే వ్యక్తిగా అది తన బాధ్యత అని పేర్కొన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 10న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా కార్యక్రమం కూడా కొనసాగుతుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకడుగు లేదని స్పష్టం చేశారు. విచారణకు హాజరయ్యే తేదీలపై న్యాయ సలహా తీసుకుంటానని, అవసరమైతే మార్చే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను కోరుతామని కవిత చెప్పారు. మరోవైపు కేంద్రంలో ఉన్న ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌, తెలంగాణ సమాజం ఎన్నటికీ తలవంచదని టీ-్వట్‌ ద్వారా స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. ఈడీ విచారణకు హాజరు కావండతో పాటు ఎమ్మెల్సీ కవిత షెడ్యూల్‌ కార్యక్రమాలన్నీ యదావిధిగా ఉంటాయని భారత జాగృతి వర్గాలు వెల్లడించాయి.

చట్టాన్ని గౌరవించడంలో ముందువరుసలో ఉంటాం
చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని, వ్యవస్థను గౌరవించే వ్యక్తుల్లో ముందువరుసలో ఉంటామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశం కోసం చేపట్టే ధర్నాతో పాటు కొన్ని ముందస్తు అపాయింట్‌మెంట్‌లు ఉనన్‌దున విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీని లొంగదీసుకోవడం కుదరదని ఈ విషయం బీజేపీ పార్టీకి తెలుసని కవిత అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పుడూ ఎండగడుతూనే ఉంటు-ందని వ్యాఖ్యానించారు. దేశ అభ్యున్నతి కోసం అవసరమైన ప్రతిసారి గొంతెత్తుతామని.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని తేల్చి చెప్పారు. ప్రజల హక్కుల గురించి నిరంతరం పోరాడతామని తెలిపారు.

- Advertisement -

మహిళా రిజర్వేషన్లపై పోరాడుతుందనే ఈ కక్ష : ఎర్రబెల్లి, సత్యవతి
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీ-సులను జారీచేయడాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌లు తీవ్రంగా ఖండించారు. హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌పై పోరాడే కవిత గొంతు నొక్క డానికే, కవితపై కక్ష సాధింపులో భాగంగానే ఈడీ నోటీ-సులు జారీ చేసిందన్నారు. ఇక బీజేపీ పతనం ప్రారంభమైనట్లేనని, బీఆర్‌ఎస్‌ ద్వారా బీజేపీకు ముప్పు ఉందనే నోటీ-సులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేని-కై-నా మేము సిద్ధమని, దేశ వ్యాప్తంగా ఉద్యమించి బీజేపీ విద్రోహాన్ని ఎండగడతామని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ను ఎదుర్కొనలేకే కవితను వేధిస్తున్నారు : నిరంజన్‌ రెడ్డి
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీ-సులు విద్వేషపూరిత రాజకీయాలకు పరాకాష్టనని మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొలేకే కవితపై కక్ష్యపూరితంగా కేసులు పెట్టి.. వేధిస్తున్నారని ఆయన అన్నారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టించి విశ్వసనీయతను దెబ్బ తీసిందని తెలిపారు. ఈ సంస్థల నోటీ-సులు, కేసులు అంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితికి వచ్చారని దుయ్యబట్టారు. ఇన్ని లక్షల కోట్లు- రూపాయలు అవినీతికి పాల్పడిన అదానీ గురించి కేంద్రం ఎందుకు నోరు మెదపడం లేదని.. ఈడీ, సీబీఐ, ఐటీ-లు ఎందుకు దర్యాప్తును చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు.

ఈడీ, సీబీఐలకు బడ్జెట్‌ పెంచండి : ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌
విపక్షాలను వేధించాలనే ఉద్దేశ్యంతోనే ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీ-సులు జారీ చేసిందని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై బీజేపీ పిచ్చెక్కినట్లు- వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐలకు బడ్జెట్‌ పెంచడం.. గల్లీ గల్లీకి ఈడీ, సీబీఐ శాఖలు పెట్టి అరెస్టులు చేయండని విమర్శించారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమం బీజేపీకు అవసరం లేదని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను కొని అక్రమంగా ప్రభుత్వాలను ఏర్పాటు- చేసిందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. మాటవినని వారిపై కేసులు పెడుతున్నారు.. దారికి వచ్చిన వారిపై దయచూపుతున్నారని మండిపడ్డారు. మేఘాలయ ఎన్నికల్లో సీఎం కాన్రాడ్‌ సంగ్మాపై అవినీతి ఆరోపణలు చేయలేదా అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సంగ్మాకు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరింది నిజమే కదా అని విమర్శించారు. సంగ్మా ప్రమాణ స్వీకారానికి బీజేపీ నేతలు హాజరు కావడం ద్వంద్వ నీతికి అద్దం పడుతుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement