Sunday, April 28, 2024

Spl Story | ఢిల్లీ లిక్కర్‌ స్కాం, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​ తప్పదా?.. తదుపరి పరిణామాలేంటి?

ఢిల్లీ లిక్కర్​ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది దర్యాప్తు సంస్థ ఈడీ. సీబీఐ కూడా కోర్టుకు ప్రొడ్యూస్​ చేసిన పలు చార్జీషీట్లలో కవిత పేరును పొందుపరిచింది. దీనికంతటికీ రాజకీయ కారణాలే అన్నది తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకంగా అందరూ భావిస్తున్నారు. అయితే.. రామచంద్ర పిళ్లై అరెస్టు తర్వాత ఈడీ దూకుడు పెంచింది. కవితకు నోటీసులు జారీ చేసింది. ఇక అరెస్టు ఖాయం అంటూ తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు చెబుతుండడంతో వీరికి ముందే సమాచారం ఎట్లా అందుతుంది? ఇది నిజమేనా అన్న ప్రశ్న చాలామంది నుంచి వినిపిస్తోంది.

– హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కూతురు, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. మార్చి 9 గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో మంగళవారం అరుణ్‌ రామచంద్ర పి్లళ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చింది. లిక్కర్‌ స్కామ్‌లో 11 మంది అరెస్ట్‌ అయ్యారు.

ఎమ్మెల్సీ కవితకు పి్లళ బినామీ అని ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. పి్లళ తాను కవిత ప్రతినిధినని దర్యాప్తులో వాంగ్మూలం ఇచ్చినట్లు- పేర్కొన్నారు. కవిత ఆదేశాల మేరకే పి్లళ పనిచేశాడని ఈడీ రిపోర్ట్‌లో పేర్కొంది. లిక్కర్‌ పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన పి్లళ, ఇండోస్పిరిట్‌ స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించారు.

- Advertisement -

ఈడీ నోటీసులతో బీఆర్‌ఎస్‌లో కలకలం
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీ-సులు జారీ చేయడం బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం రేపింది. గురువారం విచారణకు రావాలని ఈడీ నోటీ-సుల్లో పేర్కొంది. హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పి్లళతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు- తెలుస్తోంది. ఈ కేసులో రామచంద్ర పి్లళ కవితకు బినామీ అని ఈడీ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది. మద్యం వ్యాపారాల ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌లో కవిత పాత్ర కూడా ఉందని ఈడీ ఆరోపిస్తోంది.

ఈ గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో కవిత తరపున అరుణ్‌ భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు నోటీ-సులు జారీ చేసినట్లు- తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులోనే గతేడాది డిసెంబర్‌ 11న కవితను ఆమె ఇంటివద్దే సీబీఐ అధికారులు విచారించారు. దాదాపు ఏడున్నర గంటలపాటు- వివిధ అంశాలపై కవితను ప్రశ్నించారు. తాజా ఈడీ ఆమెకు నోటీ-సులు జారీ చేసింది.

సౌత్‌గ్రూప్‌లో కవిత కూడా భాగస్వామి?
వ్యాపారవేత్త పి్లళకి సంబంధించి, కవిత, వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డి ఉన్న సౌత్‌ గ్రూప్‌కు అరుణ్‌ పి్లళ, అభిషేక్‌ బోయిన్‌పల్లి, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని ఈడీ అభియోగాల్లో పేర్కొంది. పి్లళతో పాటు- ఇతర వ్యక్తులతో కుట్ర పన్నారని పాలసీలో కీలకమైన కార్టెల్‌ ఏర్పాటు-లో చురుకుగా సహకరించాడని ఈడీ ఆరోపించింది. సౌత్‌ గ్రూప్‌ నుండి ఆమ్‌ ఆద్మీకి 100 కోట్ల వరకు ముడుసులు చెల్లించారని ఆరోపించారు. ఈ గ్రూప్‌ ద్వారా కనీసం రూ.296.2 కోట్ల రుపాయల అక్రమ వ్యాపారాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది.

ఇండో స్పిరిట్స్‌లో బినామీ పేర్లు
ఇండో స్పిరిట్స్‌, దాని వ్యాపార భాగస్వామ్య సంస్థ, అరుణ్‌ పి్లళ, ప్రేమ్‌ రాహుల్‌, ఇండోస్పిరిట్‌ డిస్ట్రిబ్య్రూషన్‌ లిమి-టె-డ్‌ యాజమాన్యంలో ఉన్నాయని, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అతని కుమారుడు రాఘవ మాగుంటల బినామీ పెట్టు-బడులకు అరుణ్‌ పి్లళ మరియు ప్రేమ్‌ రాహుల్‌ ప్రాతినిధ్యం వహించారని ఈడీ అభియోగాల్లో పేర్కొంది.

లైసెన్సు ఫీజును మినహాయింపులో అవకతవకలు
ఎ-కై-్సజ్‌ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని, లైసెన్స్‌ హోల్డర్‌లకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించారని, లైసెన్సు ఫీజును మినహాయించడం, తగ్గించడం చేశారని, ఎల్‌-1 లైసెన్స్‌ను సంబంధిత అధికారి అనుమతి లేకుండా పొడిగించారని ఈడీ, సిబిఐలు ఆరోపించాయి. దీని వల్ల అక్రమ లాభాలను పొందడంతో పాటు- ఆరోపణలు ఎదుర్కొంటు-న్న అధికారులకు చెల్లించారని పేర్కొంది.

సమయం కోరిన ఎమ్మెల్సీ కవిత
మరోవైపు ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కవిత గడువు కోరినట్లు- తెలుస్తోంది. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున మార్చి 9న విచారణకు హాజరు కాలేనని ఈడీకి సమాచారం ఇచ్చారు. 33శాతం మహిళా రిజర్వేషన్ల కోసం ఈనెల 10న ఢిల్లీలో కవిత ధర్నా చేపట్టనున్నారు. ధర్నా కార్యక్రమం తర్వాత విచారణకు హాజరవుతారని ఈడీ అధికారులకు కవిత చెప్పినట్లు- తెలుస్తోంది.

ట్విట్టర్‌ వేదికగా స్పందన
ఈడీ నోటీ-సులపై ట్విట్టర్‌ వేదికగా కవిత స్పందించారు. ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీ-సులిచ్చిందని, చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు. విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయసలహా తీసుకుంటానని వివరించారు. ప్రజా వ్యతిరేకత, అణచివేత చర్యలకు తెలంగాణ ఎప్పుడూ తలవంచదని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement